Homeజిల్లాలుఅనంతపురందివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు జేఎన్టీయూలో దాపరికం..!

దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు జేఎన్టీయూలో దాపరికం..!

- Advertisement -

గుట్టుచప్పుడు కాకుండా వేడుకలు.. ఎందుకీ భయం?
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం ప్రజలు ఆరాధించిన యుగపురుషుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలను జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూఏ ) అనంతపురంలో అధికారులు నిర్వహించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. విశ్వవిద్యాలయ ప్రాంగణం, ఎన్టీఆర్ ఆడిటోరియం వద్ద  ఎన్టీఆర్ జయంతి వేడుకలను కంటితుడుపుగా, దాపరికంగా నిర్వహించడమే కాకుండా.. కార్యక్రమం సంబంధించిన సమాచారాన్ని, పత్రికా ప్రకటనలను మీడియాకు రాత్రి 7:16 గంటల సమయంలో సమాచారం  అందించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జయంతిని ఒక పండుగలా నిర్వహిస్తుంటే, ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో మాత్రం ఈ వేడుకలను అత్యంత రహస్యంగా, కొద్దిమంది అధికారుల మధ్యే ఎందుకు ముగించాల్సి వచ్చిందని విద్యార్థి సంఘాలు, ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కనీసం విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న, సిబ్బందికి, మీడియాకు  ముందస్తు సమాచారం ఇవ్వకుండా, వారిని భాగస్వామ్యం చేయకుండా వేడుకలు జరపడం వెనుక ఉన్న అంతర్యమేమిటని మండిపడుతున్నారు.
ప్రెస్ నోట్ ఆలస్యం వెనుక అసలు కథ!
కార్యక్రమం ముగిసిన వెంటనే మీడియాకు వివరాలు అందించాల్సిన బాధ్యత ఉన్న పిఆర్ఓ విభాగం మరియు యూనివర్సిటీ అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. వేడుకలు ఉదయం ముగిస్తే. పత్రికా సమయం ముగిసిన అనంతరం   ప్రకటన  విడుదల చేయడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఘనత వహించిన జేఎన్టీయూలో సమాచార విభాగం నిద్రమత్తులో.. అధికారులు సిబ్బంది వ్యవహార శైలి, విధానాలు ఉండటం.. బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు, విద్యార్థి సంఘాలు
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానాయకుడి వేడుకల విషయంలో ఇంతటి ఉదాసీనత తగదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు ఎన్టీఆర్ ఆశయాలను, ఆయన కీర్తిని అవమానించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా విశ్వవిద్యాలయాల్లో జాతీయ నాయకులు, మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను పారదర్శకంగా, అధికారికంగా అందరినీ భాగస్వామ్యం చేస్తూ నిర్వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు ప్రజలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు