Homeఅంతర్జాతీయంరష్యా చమురుపై అమెరికా మళ్లీ ఆంక్షలు!

రష్యా చమురుపై అమెరికా మళ్లీ ఆంక్షలు!

- Advertisement -


వాషింగ్టన్: అమెరికా కాలుకాలిన పిల్లిలా వ్యవహరిస్తోంది. ఇరాన్ కొట్టిన దెబ్బలకి ప్రపంచ దేశాలపై చిందులేస్తోంది. అధ్యక్షుడు తీరు ఎప్ప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రష్యా చమురుపై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులు ఎత్తివేయాలని భావిస్తుంది. చమురు సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రష్యా ముడిచమురుపై మార్చిలో అమెరికా తొలుత మినహాయింపులు ఇచ్చింది. గడువును రెండు సార్లు పొడిగించగా ఆగడువు ఈ నెల 17తో ముగియనుంది. ఈ క్రమంలోనే దానిపై మళ్లీ ఆంక్షలు విధించాలని యోచిస్తుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు రూబియో విచారణను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రష్యా చమురుపై ఇచ్చిన మినహాయింపులను పొడిగించే ఉద్దేశం ఉందా అని ఒక సెనెట్ ప్రశ్నించారు. దీనికి రూబియో బదులిస్తూ…చమురుపై ఇచ్చిన మినహాయింపులను వీలైనంత త్వరగా తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘త్వరగా దీనిని ముగించాలనుకుంటున్నాం. ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించడమే అమెరికా ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను పెంచే ఉద్దేశంతో కాలపరిమితితో కూడిన మినహాయింపులు ఇచ్చాం’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో ఉన్న పరిస్థితుల మేరకు ట్రెజరీశాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్ప్పుటికే ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా భగ్గుమంటున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు