Homeజాతీయంపాకిస్థాన్‌పై భారత్ మండిపాటు

పాకిస్థాన్‌పై భారత్ మండిపాటు

- Advertisement -


న్యూదిల్లీ: గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్ ప్రణాళికలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గిల్గిత్-బాల్టిస్థాన్ పేరుతో పిలిచే ప్రాంతం సహా జమ్మూ కశ్మీర్, లదాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. 1947లో భారత్‌లో అవి చట్టబద్ధంగా విలీనం అయ్యాయని ఉద్ఘాటించింది. పాక్ చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు…పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నెలకొన్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, అణచివేత, ఆర్థిక దోపిడీ, స్వేచ్ఛను హరించడం వంటి సమస్యలను కప్పిపుచ్చలేవని భారత విదేశాంగశాఖ పేర్కొంది. తాజా చర్యలతో ఆ ప్రాంతం పాకిస్థాన్‌కు చెందినట్లు కాదని, ఆక్రమించిన ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఆర్మీ, పారామిలిటరీ, సివిల్ పోలీసుల పర్యవేక్షణలో జులై 27న ఎన్నికలు జరుగుతాయని ప్రాంతీయ ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పీఓకే అసెంబ్లీలో 53 సీట్లు ఉండగా…45 మంది సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మరో ఎనిమిది స్థానాలను మహిళలు, వివిధ రంగాల నిపుణులు, మత పెద్దలకు కేటాయిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు