Homeఅంతర్జాతీయంభారత్‌పై ఆంక్షలు పెట్టినవారికే దెబ్బ

భారత్‌పై ఆంక్షలు పెట్టినవారికే దెబ్బ

- Advertisement -


పశ్చిమదేశాలకు పుతిన్ చురక
మాస్కో:
భారత్‌పై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే… అవి వారికే తిప్పికొడతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమాసియా దేశాలకు హెచ్చరించారు. ‘భారత్ సార్వభౌమాధికార దేశం. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్‌కు ఆంక్షల పేరిట ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే…అవి వారికే ఎదురుదెబ్బలవుతాయి. భారతదేశానికి బయటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ…తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించిందని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. ‘భారత ప్రజలకు అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి ఆ దేశానికి స్వేచ్ఛ ఉంది. ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా…భారత్ తన వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటోంది’ అని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతోన్న ఆర్థిక సదస్సులో పుతిన్ మాట్లాడారు. ఎస్-57, ఎస్-500 వంటి రష్యా రక్షణ ఉత్పత్తులను భారత్ ఒకవేళ కొనుగోలు చేస్తే…అమెరికా నుంచి ఆంక్షలు ఎదురుకావొచ్చేమోనని అడిగిన ప్రశ్నకు పుతిన్ ఈ విధంగా బదులిచ్చారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణమైన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని భారత్ అవలంబిస్తోందని పేర్కొన్నారు. ఇదిలాఉంటే…భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే భారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటించారు. భారత్ తమకు కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. అనంతరం అమెరికా వెళ్లిన ఆయన మన దేశాన్ని ఇబ్బందిపెట్టేలా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురుపై ఇచ్చిన మినహాయింపులను వీలైనంత త్వరగా తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు