Homeఅంతర్జాతీయంఅమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు

అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు

- Advertisement -

రణరంగంగా మారిన పశ్చిమాసియా
తెహ్రాన్:
గల్ఫ్ దేశాలు బాంబుల దాడులతో దద్దరిళ్లుతున్నాయి. పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. హోర్మూజ్ సమీపంలో అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనకు సంబంధించి ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. దీనికి తెÉహ్రాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తోంది. గల్ఫ్ ప్రాంతాల్లో అగ్రరాజ్య స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. అమెరికా దాడులను దురాక్రమణ చర్యగా ఐఆర్‌జీసీ అభివర్ణించింది. బహ్రెయిన్‌లోని అమెరికా నావికా ఫ్లీట్‌తో పాటు, జోర్డాన్‌లోని ఆ దేశానికి చెందిన అల్ అజ్రాక్ వైమానిక స్థావరం లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఉత్తర ఇరాక్‌లలో పలు పేలుడు శబ్దాలు వినిపించాయి. తమ భూభాగంపై దాడులు ఇలానే కొనసాగితే…తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ముందు దక్షిణ ఇరాన్‌లోని జాస్క్, సిరిక్, ఖేష్మ్ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా యూఎస్ దళాలు దాడులు చేశాయి. ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్‌పై ఆత్మరక్షణ దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడులను ట్రంప్ సమర్థించుకున్నారు. ఓ మీడియాతో మాట్లాడుతూ…ఇరాన్‌కు గట్టి సందేశం ఇచ్చేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ‘ప్రతిస్పందనలు చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నా. వారు మా హెలికాప్టర్‌ను కూల్చివేశారు. వారు చేసిన దానికి ఇది మా ప్రతిస్పందన. ఇది చాలా బలంగా… అత్యంత శక్తిమంతంగా ఉండాలని అనుకుంటున్నా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
బుషెహర్ ప్రావిన్స్‌పై ఒక అమెరికా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అయితే, ఈ ప్రకటనను అమెరికా ఇంకా ధ్రువీకరించలేదు. క్షేమంగా ఉండాలంటే… ఇరాన్ వార్నింగ్ దాడుల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు. యూఎస్ తమ సహనాన్ని పరీక్షిస్తోందన్నారు. దాడులు, బెదిరింపులకు తమ సాయుధ దళాలు కచ్చితంగా స్పందిస్తాయన్నారు. క్షేమంగా ఉండాలనుకుంటే…వెంటనే ఈ ప్రాంతాన్ని వీడాలని యూఎస్ బలగాలను హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు