Homeడి.రాజాతో విజయ్ భేటీ

డి.రాజాతో విజయ్ భేటీ

- Advertisement -


న్యూదిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత సి.జోసెఫ్ విజయ్ బుధవారం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూదిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్‌ను ఆయన సందర్శించారు. సీపీఐ కార్యదర్శులు రామకృష్ణ పాండా, పల్లబ్ సేన్ గుప్తాతో పాటు జాతీయ నాయకుడు కె.నారాయణ ఈ భేటీలో పాల్గొన్నారు. అజయ్ భవన్‌లో విజయ్‌కు డి.రాజా తదితరులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై నాయకులు చర్చించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు