Homeఅంతర్జాతీయంపీఓకేలో కూలిన పాకిస్థాన్ హెలికాప్టర్

పీఓకేలో కూలిన పాకిస్థాన్ హెలికాప్టర్

- Advertisement -

ముజఫరాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాక్ సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సైనికులందరూ ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. ఘటన సమయంలో అందులో ఎంత మంది ఉన్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సుమారు 21 మంది పాక్ సైనికులు మరణించి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముజఫరాబాద్‌లో స్థానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ పాక్ ఆర్మీ అదనపు బలగాలను మోహరిస్తోంది. ఇందులో భాగంగా పాక్ సైనికులతో ఉన్న హెలికాప్టర్ ముజఫరాబాద్ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే, వీరిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పాక్ ఆర్మీ ప్రకటించింది. పీఓకేలో ఇటీవల జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)పై నిషేధం విధించడంపై స్థానికంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరసన చేస్తున్న పౌరులపై సైన్యం జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు