Homeఆంధ్రప్రదేశ్చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

- Advertisement -

బెజవాడ రాజకీయాల్లో ‘కేశినేని సోదరుల్ణ మధ్య ఉన్న విభేదాలు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని.. తన సొంత అన్న, మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నానిపై విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేశినేని నానిపై బీఎన్‌ఎస్, ఐటీ యాక్ట్ (IT Act) కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

అసలు వివాదం ఏంటి?

కేశినేని చిన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నదాని ప్రకారం.. 2025 ఏప్రిల్ 22న కేశినేని నాని సోషల్ మీడియాలో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అందులో ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్్ణ అనే సంస్థ పేరుతో ఎంపీ చిన్ని అక్రమంగా లబ్ధి పొందుతున్నారని, బినామీల పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దుష్ప్రచారంపై గతంలోనే తాను లీగల్ నోటీసులు పంపినప్పటికీ, నాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని.. పైగా తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూనే ఉన్నారని చిన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

చిన్ని ఫిర్యాదును స్వీకరించిన పటమట పోలీసులు… కేశినేని నానిపై భారతీయ న్యాయ సంహిత (దీచీS) సెక్షన్లు 204, 351, 352, 353, 356, 61 …. ఐటీ యాక్ట్ (IT Act) సెక్షన్లు 66, 66, 66, 67, 72 కింద కేసు నమోదు చేశారు.

ఎన్నికల ఓటమితో ముదిరిన లొల్లి:

కేశినేని సోదరుల మధ్య గత కొంతకాలంగా ఆస్తులు, వ్యాపారాలు, బినామీల వ్యవహారాలపై లోపల నడుస్తున్న అంతర్గత యుద్ధం… 2024 సార్వత్రిక ఎన్నికలతో పూర్తిగా రోడ్డున పడింది. గత ఎన్నికల్లో తమ్ముడు కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయగా, అన్న కేశినేని నాని వైసీపీ తరపున నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో చిన్ని చేతిలో నాని ఘోర పరాజయం పాలైన తర్వాత ఈ రాజకీయ, కుటుంబ ఈక్వేషన్స్ మరింత దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పటమట పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారాలు సేకరిస్తున్నారు. విజయవాడ రాజకీయాల్లో ఈ అన్నదమ్ముల సవాల్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు