Homeజాతీయంకేంద్ర మంత్రి ‘జార్జి కురియన్’ రాజీనామా

కేంద్ర మంత్రి ‘జార్జి కురియన్’ రాజీనామా

- Advertisement -


ధృవీకరించిన రాష్ట్రపతి భవన్
కేరళ రాజకీయవర్గాల్లో పెద్ద చర్చ
న్యూదిల్లీ:
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఈసారి ఆయన్ను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయలేదు. కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని మంగళవారం రాష్ట్రపతి భవన్ ధ్రువీకరించింది. ఇప్పటి వరకు కురియన్ మైనార్టీ వ్యహారాలు, మత్స్య, పాడి, పశుపోషణ శాఖలలో సహాయ మంత్రి హోదాలో పని చేశారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో ఏకైక క్రిస్టియన్ మంత్రి కురియన్ మాత్రమే. ఆయన రాజ్యసభ పదవీకాలం 21తో ముగిసింది. కేరళ నుంచి బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ మోదీ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కురియన్ హఠాత్తుగా ఎందుకు తప్ప్పుకున్నారనేదానిపై రాజకీయ వర్గాల్లో భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. కురియన్ తన రాజీనామాకు గల ఖచ్చితమైన కారణాలను లేఖలోగానీ, మీడియాకు గానీ వెల్లడించలేదు. దీని వెనుక పార్టీ అంతర్గత సమీకరణాలు ఉన్నాయా, వ్యక్తిగత కారణాల వల్ల తప్ప్పుకున్నారా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. కురియన్ తదుపరి అడుగులు ఎటువైపు వేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై కురియన్ స్వయంగా స్పందిస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు