Homeప్రతి బడ్డీలో బుడ్డీలు

ప్రతి బడ్డీలో బుడ్డీలు

- Advertisement -
  • గ్రామాల్లో మద్యం ఏర్లు …
    – ఇష్టారాజ్యంగా బెల్టు షాపులు
  • బాటిల్కి ‘పది’ అధికం
  • పట్టించుకోని అధికార యంత్రాంగం

విశాలాంధ్ర బ్యూరో-శ్రీకాకుళం: ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగితే అది దేశాభివృద్ధికి సంకేతమని అంటారు. అయితే రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలవుతోంది. తాగండి.. తాగించండి.. ధోరణి కొనసాగుతోంది. ఖజానాను నింపుకునే కసరత్తు జరుగుతోంది. మద్యం విక్రయాల జోరుపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, గ్రామాల్లో బెల్టు షాపుల సామ్రాజ్యం మాత్రం సాగుతూనే ఉందని అంటున్నారు. గ్రామాల్లో మద్యం ఏరులు పారుతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితిని విమర్శిస్తున్నారు. ‘బాటిల్కి రూ.10 అధికంగా వసూలు చేసే బెల్టు షాపుకు లైసెన్సులా అలిఖిత నిబంధన పల్లెటూళ్లలో పచ్చి నిజంగా మారింది. వేళలతో సంబంధం లేకుండా, లైసెన్సుల పరిమితులతో పట్టింపు లేకుండా ఊరూరా ఇష్టారాజ్యంగా బెల్టు షాపులు వెలిశాయి. ప్రతి బడ్డీలోను బుడ్డీలు దొరికే పరిస్థితి ఏర్పడింది. ఇది నిరుపేద కుటుంబాలకు శాపంగా మారుతోంది. జిల్లాలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. రాజకీయ, అధికార అండతో ఈ అక్రమ నెట్‌వర్క్ పల్లె పల్లెకూ వేళ్లూనుకుంది. ఒకప్పుడు మండల కేంద్రానికో, కాస్త పెద్ద పంచాయతీల్లోనో మద్యం దొరికేది కానీ, ఇప్పుడు ప్రతి చిన్న పల్లె, కిరాణా కొట్టు నుంచి పాన్ డబ్బాల వరకు, చివరికి టీ బంకుల వెనుక కూడా బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ వైన్ షాపుల నిర్వాహకుల నుంచి కమీషన్ల ప్రాతిపదికన, లేదా సిండికేట్ల ద్వారా అదనపు ధరలకు కొనుగోలు చేసి తెచ్చే ఈ మద్యం… గ్రామాల్లో ఏరులై పారుతోంది. అర్ధరాత్రి అయినా సరే మందు సిద్ధంగా ఉంటోంది. బాటిల్కు పది రూపాయల మామూళ్లతో ఎక్కడైనా, ఎపðడైనా బెల్టు షాపు పెట్టుకోవచ్చనే దీమా స్థానిక వ్యాపారుల్లో కనిపిస్తోంది. జిల్లాలో టీ దొరుÅ£దేమేగానీ మద్యం మాత్రం అడుగడుక్‌కి అందుబాటులో ఉంటోంది. ఎక్సైజ్, పోలీస్ శాఖల కంటితుడుపు చర్యలు, ఉత్తుత్తి తనిఖీలతో ఈ దందా అడ్డుఅదుపు లేకుండా సాగుతోంది. దీని వల్ల పల్లెల్లో సామాజిక, ఆర్థిక సమతుల్యత దెబ్బతింటోంది. కూలీనాలీ చేసుకునే శ్రామికులు, ఆటో డ్రైవర్లు, చివరికి కాలేజీల పిల్లలు సైతం మద్యానికి బానిసలవుతున్నారు. రెక్కల కష్టాన్ని, పిý్లల చదువుల కోసం దాచుకోవాల్సిన సొమ్మును మద్యం కోసం ఖర్చు చేస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. గృహ హింస పెరిగి పల్లెల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. మత్తులో జరిగే గొడవలు… గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు దారితీస్తున్నాయి. తక్షణ లాభమే పరమావధిగా భావించే కొందరు వ్యాపారులు, తమకున్న రాజకీయ రక్షణ వల్లే ఈ నెట్‌వర్క్‌ను విస్తరించగలిగారన్నది బహిరంగ సత్యం. అధికారులు ఎపðడైన నామమాత్రపు దాడులు చేసి కేసులు పెట్టినా, మరుసటి రోజు నుంచే యథేచ్ఛగా వ్యాపారం సాగిపోతోంది. పాలకులు, ఉన్నతాధికారులు చట్టాల పుస్తకాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో కఠిన నిఘా ఏర్పాటు చేయాలనీ అనేకమంది కోరుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని విన్నవిస్తున్నారు. గ్రామాలను గుల్ల చేస్తున్న ఈ మద్యం బెల్టులను బద్దలు కొట్టకపోతే… పల్లెల్లో ఆర్థికాభివృద్ధి, ప్రశాంతత గతం అవుతుందని హెచ్చరిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా యువత మత్తుకు బానిసై రాష్ట్ర భవిష్యత్తే అంధకారమవుతుందని, ఈ అక్రమ దందాను నియంత్రించేందుకు తక్షణమే తగు విధంగా చర్యలను అధికారులు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు