గంభీర్‌పై క్రికెట్లో ట్రోలింగ్
క్రీడలు: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన టీమఇండియా ఒక్కసారిగా ట్రోల్స్‌కు గురైంది. టీ 20 ప్రపంచ చాంపియన్‌గా నిలిపిన గంభీర్ ఇప్ప్పుడు అంతర్జాతీయంగా ట్రోల్స్‌కు గురిఅతున్నాడు. క్రికెట్లో పసికూనలుగా చెప్ప్పుకునే ఐర్లాండ్‌తో వరుసగా రెండు టీ20ల్లోనూ ఓటమి పాలైంది. దీనితో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వ్యూహాలను, మార్గదర్శనంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఐసీసీ సభ్యదేశం కూడా కాని ఐస్లాండ్ క్రికెట్ అసోషియేషన్ కూడా తన సోషల్ మీడియాలో గంభీర్‌ను ట్రోల్ చేయడం గమనార్హం. మరోవైపు, భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం గంభీర్ తీరును విమర్శించాడు. ‘మేం గౌతమ్ గంభీర్‌ను మా కోచ్‌గా తీసుకోవాలని అనుకోవడం లేదు. మాకు ఇష్టం లేదు కూడానూ. అతడిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. టీమఇండియా ఆటగాళ్లను తీసుకొచ్చి… ఐర్లాండ్‌లో ఇలాంటి ఫలితాలను అందించాలంటే అసాధారణమైన ప్రతిభ కావాలి. అది గంభీర్ వద్ద పుష్కలంగా ఉందనిపిస్తోంది’ అని ఐస్లాండ్ క్రికెట్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఆల్‌రౌండర్ల వ్యూహం ఫలించలేదు: సంజయ్
భారత జట్టు ఓటమిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. ఐర్లాండ్ సిరీస్‌లో గంభీర్ ఎక్కువ మంది ఆల్రౌండర్లను తీసుకోవడంపై ఆయన మాట్లాడుతూ ‘గతంలో ఆల్‌రౌండర్ల సంఖ్య తక్కువగా ఉండేది. కానీ, గంభీర్ వచ్చాక వారికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. భారత జట్టుకు ప్రధాన మిడిలార్డర్ బ్యాటర్లు అవసరం’ అని పోస్టు పెట్టాడు. టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని సూచించాడు. ‘శుభ్‌మన్ గిల్ ఐపీఎల్లో అద్భుతంగా ఆడిన టీ20 బ్యాటర్. నేను అతడి సారథ్యం గురించి ప్రస్తావించడం లేదు. ఇలాంటి ప్లేయర్లను మాత్రం పొట్టి ఫార్మాట్లోకి మళ్లీ తీసుకురావాలి. ఐర్లాండ్‌లో పిచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడగలిగే సత్తా అతడికి ఉంది. ఇంగ్లాండ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయగలడు. గతంలోనే అతడు ఎలా ఆడాడో చూశాం’ అనే అభిప్రాయాన్ని మంజ్రేకర్ వ్యక్తం చేశారు.
మేమైతే గంభీర్‌ను కోచ్‌గా తీసుకోలేం: ఐస్లాండ్
- Advertisement -


