Homeఆంధ్రప్రదేశ్జులై 1 నుండి 4 వరకు విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయండి:...

జులై 1 నుండి 4 వరకు విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయండి: వలరాజు , నాసర్‌జీ

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : నేటి నుండి ఏఐఎసఎఫ్ ఆద్వర్యంలో కర్నూలు నగరంలో జరుగు రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఏఐఎసఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి వలరాజు, బందెల నాసర్ జీలు పిలుపు నిచ్చారు. నగరంలోని సీఆర్ భవన్‌లో ఏఐఎసఎఫ్ జిల్లా సమితి ఆద్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుండి 500 మంది విద్యార్థుల హాజరుకానున్నారని, వివిధ రంగాల మేధావులు ప్రొఫెసర్లతో ఈ శిక్షణా తరగతులు నాలుగు రోజులపాటు సామాజిక రాజకీయ ఆర్థిక విద్య విధానాలపై ప్రత్యేకించి విద్యావ్యవస్థలో శాస్త్రీయ విజ్ఞానం పై లోతైన చర్చలు జరుగుతాయని అన్నారు అయితే పాలక ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి విద్యను క్రమంగా లాభసాటి ఫ్యాక్టరీగా మారుస్తూ, ప్రభుత్వ విద్యను విద్యార్థి హక్కులను అటకెక్కిస్తూ బానిసత్వపు ఆటవికపు రాజ్యాన్ని పాఠ్యాంశాల్లోకి ఎక్కిస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల సృజనాత్మకతను ప్రాథమిక దశ నుండే విచ్చిన్నం చేసే కాషాయీకరణ, కార్పొరేటీకరణ తో అడుగులు వేస్తున్న పాలక ప్రభుత్వాలకు విద్యార్థులు ఓటు బ్యాంకు రాజకీయాల గా మారుతున్న నేపథ్యంలో శాస్త్రీయ విజ్ఞానం బదులు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై నేటికీ కులం పేరుతో సామాజికంగా దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ జీవో 77 రద్దు చేస్తాం అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తాం, పెండింగ్లో ఉన్న బకాయిలన్నిటిని అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం, విద్యార్థుల ఆత్మహత్యలను, కళాశాల విద్యార్థుల సర్టిఫికెట్లను, పెర్చుతూ అభివృద్ధి అంటున్నారు అని, మెడికల్ కళాశాల హామీలు, 107,108, జీవో రద్దు చేయకుండా అపద్దాపు హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని విద్యార్థి పోరాటాల ద్వారానే గద్దె దించుతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎసఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి సోమన్న, షాబీర్ భాష, నగర అధ్యక్ష కార్యదర్శులు అభి అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి శరత్ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు