ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు (AP EAPCET 2026 Results) విడుదలయ్యాయి. లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈ ఫలితాలను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ విభాగంలో 2,76,572మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,545 మంది హాజరయ్యారు. వీరిలో 1,82,317మంది (70.52%) క్వాలిఫై అయినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. అలాగే, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929మంది హాజరయ్యారు. వీరిలో 63,546 మంది (89.59%) క్వాలిఫై అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
టాప్ 10 ర్యాంకర్లు వీరే..
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో టాపర్లు..
- జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి – గుంటూరు జిల్లా
- కోరుకొండ శ్రావ్య – శ్రీకాకుళం
- వెన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి – పల్నాడు
- తుంగ దుర్గా సుప్రభాత్ – పల్నాడు
- తెల్లూరి శ్రేయస్ రెడ్డి – హైదరాబాద్
- ముక్కార సాకేత్ – వైఎస్‌ఆర్ కడప
- బండి వెంకట సాత్విక్ – గుంటూరు
- నూర్ బాషా హఫీజ్ – గుంటూరు
- పసల మోహిత్ – కడప
- మరక వంశీధర్ రెడ్డి – వైఎస్‌ఆర్ కడప
అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్‌లో టాపర్లు
- శంబంగి జశ్వంత్ నాయుడు – విజయనగరం
- కుడుముల వెంకట మహంత్ అక్షజ్ రెడ్డి – మేడ్చల్ మల్కాజ్‌గిరి
- కొండ్రెడ్డి హారికాదేవి శ్రీ అనూహ్య – కృష్ణా
- కర్రి సత్యనారాయణ – కాకినాడ
- బంటు ధాత్రిక – అనకాపల్లి
- పల్లికొండ దర్శ్‌తేజ – కాకినాడ
- వల్లెపు ధీరజ్ కృష్ణ – గుంటూరు
- దండమూడి జాగృతి – గుంటూరు
- ఆళ్ల శ్రీలక్ష్మి సత్యసాయి నిఖితారెడ్డి – పల్నాడు
- రేలంగి జయ షణ్ముఖి – విజయనగరం


