Homeసినిమా‘రావు బహదూర్’తో నా కల ఫలించింది: సత్యదేవ్

‘రావు బహదూర్’తో నా కల ఫలించింది: సత్యదేవ్

- Advertisement -


సినిమా: తెలుగు సినీ అభిమానులు ముందెన్నడూ చూడని స్థాయిలో ‘రావు బహదూర్’ ఉంటుందన్నారు సత్యదేవ్. ‘సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. టీజర్‌కు ప్రముఖ హీరో మహేశ్బాబు వాయిస్ఓవర్ అందించడం సినిమాకు మరింత బలాన్నిచ్చారని చెప్పారు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో వెంకటేశ్ మహా తెరకెక్కించిన చిత్రం ‘రావు బహదూర్’. మహేశ్బాబుతో కలసి చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్చంద్ర నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘రావు బహదూర్’ గురించి సత్యదేవ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘రావు బహదూర్’కు ముందు, తరువాత అని ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకొనేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ‘మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా’ అనే ట్యాగ్లైన్ అనుకున్నాం. మహేశ్బాబు ఈ సినిమా చూశాక అదే మాట అన్నారు. నమ్రతా శిరోద్కర్, నాని, సుకుమార్ సహా ఇప్పటికే సినిమాను చూసిన ప్రముఖులంతా ప్రశంసిస్తున్నారు. నా పాత్ర మేకప్నకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. మేకప్ వేయడానికి 5 గంటలు, తీయడానికి గంటన్నర పట్టేది. ఈ సినిమా కోసం రోజుకు 16 గంటలు పనిచేశాను. నా పాత్రలోనూ, కథలోనూ ఎన్నో కోణాలుంటాయి. వెంకటేశ్ మహా దాన్ని రాసిన తీరు, తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. తమిళ, మలయాళ భాషý తరహా కథల మాదిరి ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాతో నా కల నెరవేరింది’ అని సత్యదేవ్ చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు