Homeక్రీడలుటీ20లో నంబర్ వన్ గా ఇషాన్

టీ20లో నంబర్ వన్ గా ఇషాన్

- Advertisement -

రెండో స్థానంలో అభిషేక్
క్రీడలు:
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం సాధించాడు. మరో భారత బ్యాటర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి నంబర్ వన్ గా నిలిచాడు. ఇషాన్ ఖాతాలో 876 పాయింట్లుండగా. అభిషేక్ 869 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అభిషేక్, ఇషాన్ కంటే ముందు భారత్ నుంచి విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించారు. ఇటీవలే వైస్ కెప్టెన్సీ చేపట్టిన తిలక్ వర్మ ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉండగా… కెప్టెన్సీతో పాటు జట్టులో చోటూ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా ఒక్క స్థానం తగ్గి…వరుసగా 3, 6 ర్యాంకుల్లో నిలిచారు. పొట్టి ఫార్మాట్‌లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి పది స్థానాల్లో మన బ్యాటర్లే నాలుగు స్థానాల్లో ఉన్నారు.
పొట్టి ఫార్మాట్‌లో దిట్ట…
టీ 20`2026 ప్రపంచ కప్ సాధించిన తరువాత ఇటీవల ఐర్లాండ్‌లో జరిగిన రెండు టీ 20 మ్యాచ్ల్లో భారత్ ఓటమి పాలైనప్పటికీ జట్టుపై ప్రపంచంలో గట్టి నమ్మకమే ఉంది. పొట్టి ఫార్మాట్‌లో మనమే నంబర్ వన్ స్థానంలో కొనసాగడమే కాకుండా మన జట్టుతో పాటు క్రికెటర్లు ప్రసంశలు అందుకుంటున్నారు. ఐర్లాండ్‌లో ఓటమి తరువాత మన జట్టుపై పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు పరిమిత ఓవర్లు (వైట్ బాల్) ప్రధాన కోచ్ మైక్ హసన్ ప్రసంశల జల్లు కురుపించారు. భారత్ బలీయమై జట్టని కొనియాడారు. ఆ జట్టును ఎదుర్కోవడం పాకిస్థాన్కే కాదు ఏ జట్టుకైనా కష్టమేనని పొగడ్తల వర్షం కురుపించారు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. అక్కడ 5 టీ 20 మ్యాచ్‌లు షెడ్యూల్ కాగా ఆడిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు