కాశీ, మథుర విషయంలో భయమేస్తోంది!: ఉద్ధవ్ విమర్శలు
ముంబై: అయోధ్య విరాళాల చోరీ వ్యవహారం ట్రైలర్ మాత్రమేనని శివసేన (యÖబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ‘కాశీ, మథుర కడతాం అని కొందరు చెబుతున్నారని, అయోధ్యలోనే ఇంత పెద్ద ఎత్తున విరాళాల దోపిడీ జరిగితే…రేపు కాశీ, మథురలో జరిగే దోపిడీ గురించి నాకు భయమేస్తోంది’ అని ఉద్ధవ్ అనుమానం వ్యక్తం చేశారు. రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై ఉద్ధవ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలోని దాదర్‌లో నిర్వహించిన ‘రామరక్ష’ ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులతో కలిసి హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. హిందువులను దోచుకునేవారే ఇప్ప్పుడు అధికారంలో ఉండటం దురదృష్టకరమన్నారు.
బీజేపీ లేని హిందుత్వం కావాలి…
హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయ, ఆర్థిక ప్రయోజనం పొందుతుందని విమర్శించారు. ప్రధాని మోదీని ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో పోల్చడంపై ఆయన మండిపడ్డారు. తమ పార్టీ మద్దతు, కష్టార్జితంతోనే మోదీ ప్రధాని అయ్యారని, అలాంటిది ఇప్ప్పుడు ఆయనే హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమకు బీజేపీ మార్కు హిందుత్వం కాకుండా, స్వచ్ఛమైన హిందుత్వం కావాలని పిలుపునిచ్చారు. రామాలయంలో విరాళాలు దొంగిలించిన వారికి శ్రీరాముడి పేరెత్తే అర్హతే లేదని ధ్వజమెత్తారు. హిందువులు వెర్రివాళ్లు కాదని, రాముడి సొమ్మును లూటీ చేసిన వారిని క్షమించరని స్పష్టం చేశారు. శ్రీరాముడిని కాపాడుకోవడానికి హిందువులంతా కలిసి రావాలని ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు.
‘అయోధ్య’ ఘటన ట్రైలర్ మాత్రమే
- Advertisement -


