Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తున్న రఘు మేడ్జీ పాఠశాలను సీజ్ చేయండి

విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తున్న రఘు మేడ్జీ పాఠశాలను సీజ్ చేయండి

- Advertisement -

ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతులయ్య
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రఘు మిర్చి పాఠశాల యుడైస్ కోడ్ లేకుండా బోగస్ పాఠశాల పెట్టుకుని విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తున్నారని వెనువెంటనే రఘు మేడ్ పాఠశాలను సీజ్ చేయాలని కోరుతూ డీఈఓ కిష్టప్పకు వినతి పత్రాన్ని ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతులయ్య, ఏఐఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ యాదవ్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న రఘు మేడ్జ్ పాఠశాల యాజమాన్యం వారు కేవలం పాఠశాల ఓపెనింగ్ పర్మిషన్ మాత్రమే వచ్చినప్పటికీ రఘు మేడ్జ్ పాఠశాల యాజమాన్యం వారు ఇష్టానుసారంగా అడ్మిషన్లు చేస్తూ పాఠశాల నడుపుతున్నారు వీళ్లు పూర్తిగా ప్రభుత్వం వ్యతిరేకంగా నడుపుతున్నప్పటికీ బోగస్ పాఠశాలలో నడుపుతున్నారు అని ఆరోపించారు. ఇలా బోగస్ పాఠశాల నడపడం వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని తెలిపారు. ఉదాహరణకు ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం కేంద్రంలో గత సంవత్సరంలో ఫొనెక్స్ గ్లోబల్ స్కూల్ యుడైస్ కోడ్ లేకుండా బోగస్ పాఠశాల నడిపి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించారు అని తెలిపారు. అలాగే ఈ రఘు మేడ్జ్ పాఠశాల వారు కూడా అదే తంతు కొనసాగిస్తున్నారు అదేవిధంగా వేల రూపాయలకి పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ యుడైస్ కోడ్ లేకుండా పాఠశాల నడుపుతున్నటువంటి రఘు మేడ్ స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అని తెలియచేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు