Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎన్నో ఏళ్ల నాటి కల సాకారం.. విద్యార్థినిల కళ్లలో ఆనందం

ఎన్నో ఏళ్ల నాటి కల సాకారం.. విద్యార్థినిల కళ్లలో ఆనందం

- Advertisement -

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర ధర్మవరం;! ఎన్నో ఏళ్ల నాటికల సాకారం విద్యార్థినిల కళ్ళల్లో ఆనందం వచ్చిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కీ శే పరిటాల రవీంద్ర పరితపించిన విధంగా, అత్యంత వెనుకబడిన రామగిరి ప్రాంతంలో విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల కల సాకారమైంది. నసనకోట ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్య ప్రారంభిచాలని దశాబ్ధ కాలంగా ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇక్కడ ఇంటర్మీడియట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీసీ, బైపీసీ కోర్సులు మంజూరైన సందర్భంగా 10వ తరగతిలో 450మార్కులకు పైగా వచ్చిన విద్యార్థినిలు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వేషన్ ప్రకారం అప్లికేషన్లను పరిశీలించి, ఎంపికైన విద్యార్థినిలకు అడ్మిషన్ పత్రాలను అందజేశారు. ముందుగా వాటిని శ్రీ తిరుమల దేవర వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. అనంతరం కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారి ఆశీస్సులు తీసుకొని కళాశాలలో సీట్లు వచ్చిన వారికి అడ్మిషన్ పత్రాలను అందజేశారు. సీట్లు పొందిన విద్యార్థినిలు బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించి ఈ జూనియర్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.వచ్చే సంవత్సరం నుంచి వ్రాత పరీక్ష ఆధారంగా రిజర్వేషన్ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. వెనుకబడిన ఈ ప్రాంతంలో విద్యార్థినిల కోసం జూనియర్ కళాశాల ఉండాలని అప్పట్లో పరిటాల రవీంద్ర పరితపించే వారని.. ఆయన కల ఈ రోజు సాకారమైందన్నారు. ఆయన స్ఫూర్తితోనే ఈ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. ఇక్కడ ఇంటర్మీడియట్ కళాశాలకు అనుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు