Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో నేత్రదానానికి విశేష స్పందన రావడం సంతోషదాయకం

ధర్మవరంలో నేత్రదానానికి విశేష స్పందన రావడం సంతోషదాయకం

- Advertisement -

రెడ్ క్రాస్ కమిటీ మెంబర్ డాక్టర్ సంకారపు నర్సింలు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరంలో నేత్రదానానికి విశేష స్పందన రావడం సంతోషాదాయకమని రెడ్ క్రాస్ కమిటీ మెంబర్, కుల అయ్యప్ప నేత్రదాన సేకరణ కేంద్రం డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్ర దానాలు పరంపరంగా కొనసాగుతున్నాయని ఇటీవల శాంతినగర్ లో గత రెండు రోజుల్లో వరుసగా సూర్యనారాయణ పేరుగల ఇద్దరు వ్యక్తులు నేత్రదానం చేయడం జరిగిందన్నారు. ఈ నేత్రాలను విశ్వదేపా సేవా సంఘం వారు ప్రోత్సహించడం జరిగిందని అదేవిధంగా మరసటి రోజు నాగరత్నమ్మ అనే మహిళ నేత్రాలను సేకరించడం జరిగిందని తెలిపారు. వీరిని యువర్ ఫౌండేషన్ వారు ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు. ఈ విజయం వెనుక నేత్రదానం పట్ల ప్రజల్లో పెరిగిన అవగాహన, స్వచ్ఛంద సంస్థల యొక్క కృషి అభినందనీయమని తెలిపారు. అందుకు వివిధ రకములైన మీడియా సహకారం కూడా ప్రాముఖ్యత తో కీలకపాత్ర వహించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ధర్మవరం పట్టణం తో పాటు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో నేత్రదానంలో ప్రధమ స్థానంలో ఉండుట మరింత గర్వకారణమని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు