Homeఆంధ్రప్రదేశ్పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్..

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్..

- Advertisement -

100 సీట్లతో ఈ ఏడాదే తరగతులు
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక ముందడుగు పడింది. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరమే 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి మంజూరు చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ వెల్లడించారు.అదేవిధంగా విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు అదనంగా 75 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనట్లు తెలిపారు.దీంతో ఈ విద్యా సంవత్సరంలో పాడేరు, కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఇప్పటికే లభించిన సీట్లతో కలిపి రాష్ట్రానికి మొత్తం 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు లభించినట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ విద్యా సంవత్సరంలోనే తొలి బ్యాచ్ విద్యార్థులు
పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల అనుమతుల ప్రక్రియలో కొన్ని సాంకేతిక అంశాలు అడ్డంకిగా నిలిచాయని మంత్రి వివరించారు.అయితే ప్రభుత్వం వేగంగా స్పందించి కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నియామకం, వైద్య పరికరాల ఏర్పాటు వంటి అంశాలను పూర్తి చేయడంతో ఎన్‌ఎంసీ అనుమతి లభించిందన్నారు.దీంతో ఈ విద్యా సంవత్సరంలోనే తొలి బ్యాచ్ విద్యార్థులు కళాశాలలో ప్రవేశించనున్నారని తెలిపారు.ఎన్‌ఎంసీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాల పురోగతిని ప్రభుత్వం నిరంతరం సమీక్షించిందని మంత్రి చెప్పారు.కేంద్ర ఆరోగ్యశాఖతో పాటు ఎన్‌ఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి రాష్ట్ర ప్రతిపాదనలను తీసుకెళ్లడం వల్ల వాటికి ఆమోదం లభించిందని వెల్లడించారు.

వైద్య విద్యార్థులకు శుభవార్త: ఏపీఎన్‌ఏఎంపీఏ
రాష్ట్రానికి అదనంగా 325 ఎంబీబీఎస్ సీట్లు మంజూరవడాన్ని ఆంధ్రప్రదేశ్ నీట్ యాస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ (ఏపీఎన్‌ఏఎంపీఏ) స్వాగతించింది.ఈ నిర్ణయం వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులతో పాటు వేలాది కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే శుభవార్తగా సంఘం అధ్యక్షుడు పి. అరుణ్‌చౌదరి, ఉపాధ్యక్షుడు కేవీపీఆర్ పట్నాయక్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో పాటు సంబంధిత అధికారులకు వారు అభినందనలు తెలిపారు.రాష్ట్రంలో ఇంకా వెయ్యి వరకు అదనపు ఎంబీబీఎస్ సీట్లు సాధించే అవకాశం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు