Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇంటర్మీడియట్ లక్ష్యాన్ని ఎంచుకొనుటకు ఇదే సమయం

ఇంటర్మీడియట్ లక్ష్యాన్ని ఎంచుకొనుటకు ఇదే సమయం

- Advertisement -

పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు
విశాలాంధ్ర ధర్మవరం;; ఇంటర్మీడియట్ లక్ష్యాన్ని ఎంచుకొనుటకు ఇదే మంచి సమయము అని ఐ హెచ్ ఆర్ సి ఐ నేషనల్ సీనియర్స్ సెక్రటరీ అండ్ ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరము చదువు వాటి భవిష్యత్తు అనే అంశంపై విద్యార్థులకు పలు విషయాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులుగా మీ లక్ష్యం ఏమిటో ఇక్కడే నిర్ణయించుకోవాలి. అంటూ విద్యార్థులకు సూచించడం జరిగిందన్నారు. విద్యార్థినీయులను దృష్టిలో ఉంచుకొని తాము భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారో (ఇంజనీర్, డాక్టర్, చార్టర్డ్ అకౌంటెంట్, సివిల్ సర్వెంట్ మొదలైనవి) ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండాలి అని,. ఆ లక్ష్యం వైపే వారి అడుగులు సాగాలి అని తెలిపారు.​స్వయం క్రమశిక్షణ ఈ వయసులో ఆకర్షణలు, పరధ్యానాలు ఎక్కువగా ఉంటాయి అని,వాటికి లొంగకుండా, ఏ సమయంలో ఏం చేయాలో ఆ సమయంలోనే చేసే స్వయం క్రమశిక్షణ చాలా అవసరం అని స్పష్టం చేశారు.​నిరంతర కృషి, పట్టుదల ఇంటర్ సిలబస్ పదో తరగతి కంటే చాలా ఎక్కువగా, లోతుగా ఉంటుంది అని తెలిపారు. మొదట్లో కష్టంగా అనిపించినా, పట్టుదలతో చదివితేనే మంచి మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు. అందుకోసం మీకు ఉండాల్సింది ఓపిక, అలాగే లక్ష్యం ఇవన్నీ ఉండాలంటే మీలో ఐక్యూ పెరగాలి అని, ఐక్యూ పెరగాలంటే ప్రాణాయామం, ధ్యానం లాంటి ముఖ్యమైన వాటిపై శ్రద్ధ చూపాలి అని తెలిపారు. మొబైల్ ఫోన్స్, ఇంస్టాగ్రామ్స్ యూట్యూబ్ ఫేస్బుక్ తదితర అసంధర్భమైన విషయాలకు సమయాన్ని ఎనర్జీని దుర్వినియోగం చేసుకోరాదని సూచించడం జరిగిందన్నారు. ఉన్న శక్తిని మీ లక్ష్యాన్ని కేటాయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో. కాలేజీ ప్రిన్సిపల్ వనితావని, అధ్యాపకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు