Homeజిల్లాలుశ్రీ సత్యసాయి18న ప్రత్యేక లోక్ఆదాలత్..

18న ప్రత్యేక లోక్ఆదాలత్..

- Advertisement -

సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ధర్మవరం కోర్టులో జూలై 18వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ కు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జి నందిని,
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ వెంకట హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా కోర్టులో న్యాయవాదులతో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు చాంబర్లో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక లోక్ అదాలత్ లో ఎన్ఐ యాక్ట్ కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా జూలై 18వతేదిన నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు