బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పుట్టపర్తి రోడ్‌లో గల జివిఆర్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తున్న లెన్స్‌కార్ట్ షోరూమ్‌కు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, కమర్షియల్ వినియోగ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ మరియు ఇతర చట్టబద్ధ అనుమతులపై సమగ్ర విచారణ నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్, స్థానిక ఆప్టికల్ ఉద్యోగస్తులతో కలిసి ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఏ.ఓ ఖతిజున్ కుప్రాకువినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ, ధర్మవరం ప్రజల ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యే శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థానిక వ్యాపారులు, ఉద్యోగులు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ వారి సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని, కార్పొరేట్ సంస్థల కంటే స్థానిక చిన్న వ్యాపారులు, ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.అలాగే సంబంధిత భవనానికి సంబంధించిన అన్ని అనుమతులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే సంయుక్త తనిఖీ నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనలు తేలితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగుల జీవనోపాధిని పరిరక్షించేలా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు సురేంద్ర కుమార్, జిల్లా కార్యదర్శి రాచర్ల నారాయణస్వామి, సాకే కుళ్లాయప్ప, ఎంఎస్ఎఫ్ నాయకులు కేశగాళ్ల ప్రదీప్, గణేష్, సంతోష్ నాయక్, స్థానిక ఆప్టికల్ ఉద్యోగస్తులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
ధర్మవరంలో లెన్స్‌కార్ట్ షోరూమ్‌పై సమగ్ర విచారణ జరగాలి
- Advertisement -
RELATED ARTICLES


