టీమ్ఇండియాకు ఆయన సేవలు అవసరం: బీసీసీఐ కార్యదర్శి దేవజిత్
క్రీడలు: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ గురించి వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఇంగ్లాండ్‌లో వన్ డే సిరీస్ ముగిసిన తరువాత రోహిత్కు ఉద్వాసన అంటూ వస్తున్న పుకార్లను బీసీసీఐ తోసిపుచ్చింది. దీనిపై బీసీసీఐ స్పందించింది. ‘రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆదివారం లార్డ్స్‌లో ఆడేది రోహిత్ కెరీర్‌లో చివరి మ్యాచ్ కాదు. మేనేజ్‌మెంట్ ఆ దిశగా చర్చించలేదు. భారత్ తరఫున రోహిత్ కొనసాగుతాడు. మున్ముందు సిరీస్లకూ అతడు అందుబాటులో ఉంటాడు. వన్ డే జట్టులో అతడు రెగ్యులర్ సభ్యుడు. మీడియాలో వచ్చే ఊహాగానాలను అభిమానులు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. టీమ్ఇండియాకు రోహిత్ శర్మ సేవలు కొనసాగుతాయి. జట్టు ప్రణాళికల్లో ఉన్నంత కాలం అతడు ఉంటాడు’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
వరల్డ్ కప్‌లో ఆడే ఆశలు సజీవం…
టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ లక్ష్యం వచ్చే వన్డే ప్రపంచ కప్‌లో ఆడి విజేతగా నిలవడం. అతడి కెరీర్‌లో ఇదొక్కటే ఇప్పుడు లోటు. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని కెప్టెన్గా జట్టుకు అందించాడు. ఇప్పటికే సారథ్యం నుంచి వైదొలగిన రోహిత్ కనీసం ఆటగాడిగానైనా కపðను సాధించాలని చూస్తున్నాడు. కానీ, గంభీర్-అజిత్ అగారక్కర్ మాత్రం 40 ఏళ్లకు చేరువ కాబోతున్న రోహిత్ ప్లేస్‌లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ను సిద్ధం చేయాలని చూస్తున్నారు. దీంతో గత రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించని రోహిత్ లార్డ్స్ మ్యాచ్ తర్వాత వన్డేలకూ వీడ్కోలు పలుకుతాడని చర్చ మొదలైంది. ఇప్పుడు సైకియా వ్యాఖ్యలతో రోహిత్ భవిష్యత్తుపై అభిమానుల్లో అనుమానాలు తీరిపోతాయి.
ఎన్నో మైలు రాళ్లు అధిగమించిన హిట్ మ్యాన్…
భారత జట్టులో హిట్ మ్యాన్గా పేరొందిన రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ వన్డేల్లో అరంగ్రేట్రం చేశాడు. 2013లో ఓపెనర్‌గా వచ్చిన నుంచి తన ఆట తీరును పూర్గిగా మార్చుకుని హిట్ మ్యాన్గా పేరొందాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (264 పరుగులు) చేసి రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో 3 సార్లు డబుల్ సెంచరీలు సాధించిన ఘనత దక్కించుకున్నాడు. 2013లోనే టెస్ట్ క్రికెట్లోకి అడుగు పెట్టిన రోహిత్ అన్ని ఫార్మా{్లకు పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి భారత్‌కు అద్భుత విజయాలు అందించాడు. అంతర్జాతీ క్రికెట్‌లో అత్యధిక సికస్ర్లు, ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు రోహిత్ పేరునే ఉంది.
భారత్ తరపున రోహిత్ కొనసాగుతాడు
- Advertisement -


