Homeజాతీయంజంతర్‌ మంతర్‌లో ఉద్రిక్తత.. సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన అభిజిత్‌ దీప్కే

జంతర్‌ మంతర్‌లో ఉద్రిక్తత.. సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన అభిజిత్‌ దీప్కే

- Advertisement -

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ ధర్నా చౌక్‌ మరోసారి నిరసనలతో ఉద్రిక్తంగా మారింది.
ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించడాన్ని నిరసిస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు.
తమ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయబోమని, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

నీట్‌ వివాదంపై కొనసాగుతున్న ఆందోళనలు..
నీట్‌ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ జూన్‌ 20 నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఈ ఉద్యమానికి సంఘీభావంగా సోనం వాంగ్‌చుక్‌ జంతర్‌ మంతర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా, శనివారం నాటికి ఆయన దీక్ష 21వ రోజుకు చేరుకుంది.

ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలింపు..
నిరాహార దీక్ష కారణంగా సోనం వాంగ్‌చుక్‌ ఆరోగ్యం విషమించడంతో శనివారం ఉదయం ఢిల్లీ పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు.ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, వైద్యుల సూచనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.అయితే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వాంగ్‌చుక్‌ను బలవంతంగా అక్కడి నుంచి తరలించారని సీజేపీ నాయకులు ఆరోపిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఉద్యమం కొనసాగుతుందన్న అభిజిత్‌ దీప్కే..
సోనం వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించడాన్ని నిరసిస్తూ సీజేపీ చీఫ్‌ అభిజిత్‌ దీప్కే స్వయంగా నిరాహార దీక్షకు దిగారు.ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించే వరకు వెనక్కి తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు.ఁమా ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.ఎల్లుండి పార్లమెంట్‌ వరకు మార్చ్‌ నిర్వహిస్తాం. ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించే వరకు జంతర్‌ మంతర్‌ను వీడబోముఁ అని అభిజిత్‌ దీప్కే ప్రకటించారు.అదేవిధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని, పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చాలని, నీట్‌ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్‌ చేశారు.

పోలీసుల తీరుపై మరోసారి విమర్శలు..
ఇదే అంశంపై గతంలోనూ అభిజిత్‌ దీప్కే పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు.జంతర్‌ మంతర్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో తనపై పోలీసులు దాడి చేసి, కొట్టి అదుపులోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.అలాగే, నన్ను కొట్టారు… సోనం సర్‌ను బలవంతంగా తీసుకెళ్లారు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.అయితే అభిజిత్‌ చేసిన ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు