ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప
విశాలాంధ్ర ధర్మవరం; చక్కటి కంటిచూపు అనేది అందరికీ వెలుగునిస్తుందని ఆప్తారామిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని గొట్లూరు జడ్పీ హెచ్ఎస్ పాఠశాల యందు 131 మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించారు. అనంతరం వారికి వైద్య చికిత్సలు అందించగా కేవలం నలుగురికి మాత్రమే కంటి అద్దముల అవసరం ఉన్నదని వారు తెలియజేశారు. తదుపరి కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. త్వరలో ప్రభుత్వం ద్వారా అద్దాలను పంపిణీ చేస్తామని తెలిపారు. తదుపరి కంటి సంరక్షణ గూర్చి వాటి ఆవశ్యకత గూర్చి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఎస్ రాజశేఖర్ రెడ్డి, మలేరియా అసిస్టెంట్ ఆంజనేయులు, ఏఎన్ఎం నీరజ, హెడ్మాస్టర్ జగన్నాథం, ఉపాధ్యాయ బృందం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చక్కటి కంటి చూపు అనేది వెలుగునిస్తుంది..
- Advertisement -
RELATED ARTICLES


