Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మేంద్రప్రధాన్ రాజీనామ చేయాలి - యుటిఎఫ్ నాయకులు

ధర్మేంద్రప్రధాన్ రాజీనామ చేయాలి – యుటిఎఫ్ నాయకులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థులను, టెట్ పరీక్షల పేరుతో ఉపాధ్యాయులను మానసిక ఇబ్బందికి గురి చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ధర్మేంద్రప్రధాన్ తక్షణం రాజీనామా చేయాలని యుటియఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి ,యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి జిల్లా కార్యదర్శి నాగేంద్రమ్మ డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా యుటియఫ్ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష లీకేజీ వల్ల 20మందికి పైగా విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించని కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే ఎన్ఐఏను రద్దు చేసి, నీట్ పరీక్షను రాష్ట్రాలు నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. నీట్ పరీక్షలు రద్దు, విద్యారంగ ప్రక్షాళన, విద్యామంత్రి తక్షణం రాజీనామా చేయాలని కోరుతూ పర్యావరణ, సామాజిక విద్యావేత్త సోనమ్వాంగ్ చుక్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను భగ్నంచేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిచారు.2010కంటే ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల దేశంలో 20లక్షలకుమందిపైగా ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురి అవుతున్న కేంద్ర మానవ వనరుల మంత్రి కనీసం స్పందించకపోవడం పట్ల తీవ్ర నిరసన తెలిపారు. 2010 ఏప్రియల్ నుండి అమలులోకి వచ్చిన విద్యాహక్కు చట్టంలో ఉపాధ్యాయుల నియామకానికి టెట్ అర్హత సాధించాలనే నిబంధన పెట్టారని, చట్టం అమలు నుండే వర్తించాల్సిన నిబంధనను, చట్టం అమలుకు ముందు వర్తింపజేయడం సరికాదని తెలిపారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో కనీసం చర్చించకుండా, ఉపాధ్యాయుల ఆందోళనకు కారణమైన విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1) సవరణ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కేంద్ర విద్యామంత్రి తక్షణం రాజీనామా చేయాలని తెలిపారు.నీట్ పరీక్ష లీకేజీ, టెట్ పరీక్ష నుండి ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి వైఖరికి నిరసనగా కార్యక్రమం ధర్మవరం పట్టణంలో కాలేజ్ సర్కిల్లో నిరసన తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రితో రాజీనామా చేయించాలని, ఎన్డీఏను రద్దు చేసి నీట్ లాంటి పరీక్షలు రాష్ట్రాలు నిర్వహించుకునే విధంగా అవకాశం కల్పించాలని, టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డివిజన్ యుటిఎఫ్ నాయకులు హెచ్ రామాంజనేయులు, పెద్దకోట్ల సురేష్, వెంకట కిషోర్, రాంప్రసాద్, కేజీవి నాగిరెడ్డి, గోపాలరావు, మణిమాల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు