Homeజాతీయంవిద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాలి: రాహుల్ డిమాండ్

విద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాలి: రాహుల్ డిమాండ్

- Advertisement -


ప్రధాని నివాసం వద్ద ధర్నా
న్యూదిల్లీ:
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో విపక్షాలు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ధర్నా చేపట్టారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్కు నిరసనగా చేపట్టిన ఈ ధర్నాలో రాహుల్తో పాటు ఖడ్గే, కేసీ, ప్రియాంక, పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. చేతులకు సంకెళ్లు వేసుకుని కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. గూండాగిరి, నిరంకుశత్వం వద్దంటూ…అణచివేత చర్యలు నడవవంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ యువతపై పోలీసులు సోమవారం లాఠీచార్జ్కు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీపై పార్లమెంట్‌లో చర్చకు అంగీకరించలేన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని, ప్రధాని మోదీ మౌనం వీడాలని, నీట్ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి సంప్రదింపులు…
మోదీ నివాసం వద్ద అనూహ్య రీతిలో కాంగ్రెస్ అగ్రనేతలు ధర్నాకు దిగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడకు చేరుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆందోళన విరమించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు