Wednesday, January 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత కంటి ఆపరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్డీఏ కార్యాలయమంత్రి ఇంచార్జ్ హరీష్ బాబు

ఉచిత కంటి ఆపరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్డీఏ కార్యాలయమంత్రి ఇంచార్జ్ హరీష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;;- ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో, 22వ వార్డు నాయకులు ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో శాంతిరాం ఐ హాస్పిటల్ కర్నూల్ వారిచే ధర్మవరం పట్టణంలోని ప్రజల కోసం ఎమ్మార్వో ఆఫీస్ విశ్రాంత ఉద్యోగుల కార్యాలయ ఆవరణ నందు ఏర్పాటుచేసిన ఉచిత కంటి ఆపరేషన్ కార్యక్రమాన్ని ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించడానికి ఆధునిక సౌకర్యాలతో ఏర్పాట్లు చేసి “ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన దృష్టి కోసం మేము ఈ ఉచిత కంటి ఆపరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం అని తెలిపారు. ఇది కంటి లోపం ఉన్న నిరుపేద, అర్హులైన వ్యక్తులకు ఒక మంచి అవకాశం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎంతో ప్రజావాదం కలిగిస్తుందని, దీనివల్ల ఎవరైనా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత సేవలు అందిపుచ్చుకోగలుగుతారని అభిప్రాయపడ్డారు. అలాగే వారి ఆరోగ్య సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు