విశాలాంధ్ర – ఉరవకొండ : స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉరవకొండలో ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మేజర్ పంచాయతీ కార్యాలయం నుంచి పాతపేట మీదుగా జిల్లా పరిషత్ సెంట్రల్ హైస్కూల్ వరకు ర్యాలీ సాగింది. అలాగే స్థానిక సెంట్రల్ హై స్కూల్ మరియు సమీపంలోనే సంక్షేమ హాస్టల్ ను ఎంపీడీవో రవి ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనిటీ శానిటేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరమైన చోట అదనపు శానిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌లో కిచెన్, ఆర్‌ఓ ప్లాంట్‌ను సక్రమంగా వినియోగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వార్డెన్‌కు సూచించారు. తడి, పొడి చెత్తను వినియోగించి కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి పాఠశాలలోనూ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సతీష్ కుమార్, ఎంఈఓ ఈశ్వరప్ప, ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ పాల్గొన్నారు. మేజర్ పంచాయతీ కార్యదర్శి సయ్యద్ షమీర్ భాష జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్, పంచాయతీ మేస్త్రీలు, హరిత రాయబారులు, సచివాలయ సిబ్బంది ఎంఆర్‌పీ హరి, స్వచ్ఛభారత్ మండల కోఆర్డినేటర్ యం. జయప్రకాష్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


