Homeజిల్లాలుకర్నూలుపదోతరగతి టాపర్లకు ప్రోత్సాహక బహుమతులు అందజేత

పదోతరగతి టాపర్లకు ప్రోత్సాహక బహుమతులు అందజేత

- Advertisement -

పదోతరగతిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం

విశాలాంధ్ర – పెద్దకడబూరు : స్వాతంత్య్ర సమరయోధులు వెంకటరెడ్డి 116వ జయంతిని పురస్కరించుకుని ఆయన మనుమడు వెంకటరెడ్డి శనివారం మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యాసంవత్సరంలో జరిగిన పదోతరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన 5 మంది విద్యార్థులకు స్మారక ప్రతిభా ప్రశంసా పత్రాలు, నగదును బహుమతిగా అందజేశారు. 553 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన ఖాదర్ బాషాకు 5,016, 526 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిన నరసింహ నాయుడుకు 3016 రూపాయలు, 521 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిన రాజ్ కుమార్ కు 2016 రూపాయలు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే 506 మార్కులు సాధించిన కీర్తన, శ్రీ లక్ష్మీలకు 1016 రూపాయలు చొప్పున నగదు బహుమతులను వెంకటరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమా రాజేశ్వరమ్మలు అందజేశారు. అంతకు ముందు స్వాతంత్య్ర సమరయోధుడు వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు