Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచడమే మా లక్ష్యం

ప్రభుత్వ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచడమే మా లక్ష్యం

- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ సంకారపు నర్సింహులు
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచడమే మా లక్ష్యము అని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ సంకరపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిని స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వారు పరిశీలించారు. అనంతరం నేరుగా రోగులతో కాసేపు మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు సిబ్బందితో మన ప్రభుత్వ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతిరోజు ఎప్పటికప్పుడు పరిశుభ్రత ఉండేలా సిబ్బందికి సూచించాలని తెలిపారు. అదేవిధంగా రోగులకు తల దిండ్లు 100 మందికి పంపిణీ చేశారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటుచేసిన రోగుల నమోదు కేంద్రమును కూడా వారు పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మార్పులు రావడం పట్ల రోగులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి చూపెట్టెంట్ తిపేంద్ర నాయక్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు