– కడియం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిక్కాల సూరిబాబు
విశాలాంధ్ర – కడియం : సామాజిక సమస్యలపై వేగంగా స్పందిస్తూ కడియం మండలంలో జర్నలిస్టులుగా సేవలందిస్తున్న పళ్ళ సోదరుల కృషి ప్రశంసనీయమని కడియం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిక్కాల సూరిబాబు అన్నారు. కడియం ప్రెస్ క్లబ్ సలహాదారు పళ్ళ వెంకటగిరి పుట్టినరోజు పురస్కరించుకొని అధ్యక్షులు సూరిబాబు ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టుల మధ్య బుధవారం శెట్టి పోసిబాబు కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సూరిబాబు మాట్లాడుతూ గతంలో ఆంధ్రభూమి జర్నలిస్టుగా పళ్ళ రమేష్ సుదీర్ఘకాలం సేవలు అందించారని అన్నారు. ఆయన సోదరుడు వెంకటగిరి అన్న బాటలోనే జర్నలిజాన్ని పుణికిపుచ్చుకొని విశాలాంధ్ర స్టాఫ్ రిపోర్టర్ గా ముందుకు కొనసాగుతున్నారన్నారు. నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో మెలుగుతూ, అజాతశత్రువులుగా పళ్ళ సోదరులు గుర్తింపు పొందారన్నారు. కడియం ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానని పళ్ళ వెంకటగిరి అన్నారు. కొంత మొత్తం విరాళం చెక్కును ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ఉపయోగించాలని కోరుతూ అధ్యక్షులు చేతికి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అన్నందేవుల సూర్యచంద్రరావు, దూడల అర్జున్, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ, కొప్పిశెట్టి సుబ్రమణ్యం, పేపకాయల బుజ్జి, పాలగుమ్మి శేషగిరి, యడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.


