Homeజిల్లాలుతూర్పు గోదావరిగుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, మాధవ రాయుడుపాలెం, స్మశాన వాటిక సమీపంలో గల పంట కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు తెలిపారు. మృతుని వయసు సుమారుగా 50 నుండి 55 సంవత్సరాలు ఉంటుందన్నారు. పచ్చ తెలుపు రంగులు కలిగిన గళ్ళ చొక్కా, నలుపు రంగు నిక్కరు ధరించి ఉన్నాడని, నిక్కరుపై సి కె అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయని తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే 94401 52911, 94407 96586 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. మాధవ రాయుడుపాలెం వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడియం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు