విశాలాంధ్ర – కడియం : భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భావితరాలకు దేశం పట్ల భక్తి భావాన్ని పెంపొందించే విధంగా కడియం పల్ల వెంకన్న నర్సరీలో వేలాది మొక్కలతో రూపొందించిన ప్రత్యేక ఆకృతి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘వందేమాతరం’ నినాదానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రకృతిని దేశభక్తితో మేళవిస్తూ నర్సరీ యాజమాన్యం ఈ వినూత్న రూపకల్పనను రూపొందించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలలో స్ఫూర్తిని నింపిన ‘వందేమాతరం’ నినాదాన్ని మొక్కలతో అక్షర రూపంలో ఏర్పాటు చేశారు. తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా భారతీయుల్లో స్వేచ్ఛా కాంక్షను రగిలించిన ఈ నినాదం నేటి తరానికే కాకుండా భావితరాలకు కూడా స్ఫూర్తిగా నిలిచేలా ఆకృతిని రూపొందించారు. ఈ వినూత్న దేశభక్తి కూర్పును చూసిన పలువురు సందర్శకులు పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు. నర్సరీ యాజమాన్యంలోని పల్ల సత్యనారాయణమూర్తి, పల్ల వెంకటేష్, పల్ల వినయ్ లను పలువురు ప్రశంసించారు.
పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలతో ప్రత్యేక ఆకృతి
- Advertisement -
RELATED ARTICLES


