- సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్.. సెప్టెంబర్ 27న ఫైనల్
- ఫైనల్‌తో కలిపి మొత్తం 13 మ్యాచ్‌లు.. మంగళగిరి వేదికగా మరోసారి డే, నైట్ మ్యాచ్‌లు
- డబ్ల్యూఏపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్
- ప్రేక్షకులకు మరోసారి ఉచిత ప్రవేశం
- *లీగ్ ను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), సెక్రటరీ సానా సతీష్ బాబు, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ విశాలాంధ్ర విజయవాడ (స్పోర్ట్స్ కరస్పాండెంట్) :
మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న డబ్ల్యూఏపీఎల్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ లీగ్‌లో ఫైనల్ మ్యాచ్‌తో కలిపి మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ 27న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు ఫైనల్ మ్యాచ్‌కు ఏదైనా అంతరాయం కలిగితే ఒక రిజర్వ్ డ్ డే రోజున మ్యాచ్ నిర్వహిస్తారు .
మంగళగిరి వేదికగా జరగనున్న ఈ పోటీల్లో డే, నైట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మహిళా క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించేలా మరోసారి ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. గతంలో లీగ్‌కు లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కూడా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్రీడాకారిణులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
నాలుగు జట్ల మధ్య పోటీ
డబ్ల్యూఏపీఎల్‌లో నాలుగు జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లు లీగ్ దశలో పరస్పరం తలపడుతూ తమ ప్రతిభను ప్రదర్శించనున్నాయి. పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుని టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌తో లీగ్ విజేత ఎవరో తేలనుంది.
మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా
భారత మాజీ కెప్టెన్, మహిళా క్రికెట్లో ప్రముఖ క్రీడాకారిణి మిథాలీ రాజ్ డబ్ల్యూఏపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఆమె అనుభవం, క్రికెట్ పట్ల ఉన్న అభిమానం, మహిళా క్రీడాకారిణులకు అందించిన ప్రేరణ లీగ్‌కు మరింత ప్రత్యేకతను తీసుకురానున్నాయి. మిథాలీ రాజ్ భాగస్వామ్యం ద్వారా మహిళా క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు నిర్వాహకులు కృషి చేయనున్నారు.
ప్రత్యేక అతిథుల సమక్షంలో ప్రారంభోత్సవం
డబ్ల్యూఏపీఎల్‌ను మరోసారి ఘనంగా ప్రారంభించేందుకు ప్రత్యేక అతిథులను ఆహ్వానించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక అతిథుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
విజయవంతం చేసేందుకు ఏసీఏ ఆధ్వర్యంలో సన్నాహాలు
డబ్ల్యూఏపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), సెక్రటరీ సానా సతీష్, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో సన్నాహాలు కొనసాగుతున్నాయి.మ్యాచ్‌ల నిర్వహణ, క్రీడాకారిణులకు అవసరమైన సౌకర్యాలు, ప్రేక్షకుల కోసం ఏర్పాట్లు, లీగ్‌కు సంబంధించిన ఇతర అంశాలపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించేలా పోటీలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
డబ్ల్యూఏపీఎల్ ద్వారా ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారిణులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక లభించనుంది. లీగ్ విజయవంతం కావడానికి క్రీడాకారిణులు, జట్లు, నిర్వాహకులు, ప్రేక్షకులు సమష్టిగా సహకరించాలని ఏసీఏ ప్రతినిధులు కోరుతున్నారు.సెప్టెంబర్ 19న ప్రారంభమై, సెప్టెంబర్ 27న ఫైనల్‌తో ముగియనున్న డబ్ల్యూఏపీఎల్ పోటీలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.


