Homeఆంధ్రప్రదేశ్పోలీసు క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు

పోలీసు క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు

- Advertisement -

రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన క్రీడాకారులను జాతీయస్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఃఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీః ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ప్రకటించారు. పోలీసు క్రీడాకారులకు అత్యున్నత స్థాయి శిక్షణ అందించడంతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పించి వారిని ప్రొఫెషనల్‌ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసు శాఖ, విట్‌-ఏపీ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఃఏపీ స్టేట్‌ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌-2026ః శుక్రవారంతో ముగిసింది. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలను అందజేశారు.

నాలుగు రోజులు.. 1,900 మంది క్రీడాకారులు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా.. ఃఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీః లోగోను ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ.. మనది ఏపీ పోలీస్‌ టీమ్‌. మనమంతా ఒకే కుటుంబం. సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలం అని పేర్కొన్నారు.నాలుగు రోజుల పాటు జరిగిన పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌లో రాష్ట్రంలోని వివిధ పోలీసు విభాగాలకు చెందిన 1,900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.పలు క్రీడా విభాగాల్లో అత్యధిక పతకాలు సాధించిన విశాఖపట్నం రేంజ్‌.. మహిళలు, పురుషుల కేటగిరీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. విజేతలకు డీజీపీ పతకాలను ప్రదానం చేశారు.

ఈగల్‌ విభాగానికి 38 పతకాలు
ఈ పోటీల్లో ఈగల్‌ విభాగం తరఫున పాల్గొన్న క్రీడాకారులు మొత్తం 38 పతకాలను సాధించారు. ఇందులో 10 బంగారు, 16 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈగల్‌ విభాగాధిపతి ఆకే రవికృష్ణ వ్యక్తిగతంగా 8 పతకాలు సాధించారు. ఆయన ఖాతాలో 2బంగారు, 4రజత, 2కాంస్య పతకాలు ఉన్నాయి.

సీఎం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌కు చంద్రబాబు అభినందనలు

ఏపీ స్టేట్‌ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌-2026ఃలో పలు పతకాలు సాధించిన సీఎం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ కె. మధుసూదన్‌రావును ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో మధుసూదన్‌రావు స్వర్ణ పతకాలు సాధించారు. టీమ్‌ ఈవెంట్‌లో రజత పతకం, సెట్స్‌ డబుల్స్‌లో కాంస్య పతకాన్ని కూడా ఆయన దక్కించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు