Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాపోలీస్ స్పోర్ట్స్ మీట్లో 'శంకర్రావు'కు గోల్డ్ మెడల్

పోలీస్ స్పోర్ట్స్ మీట్లో ‘శంకర్రావు’కు గోల్డ్ మెడల్

- Advertisement -
  • ఆలిండియా స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న పోలీస్

విశాలాంధ్ర – (స్పోర్ట్స్, కరెస్పాండంట్): ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో విశాఖ పోలీసులకు పలు పతకాలు లభించాయి. ద్వారకా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న ఎస్.శంకర్రావు బాక్సింగ్ విభాగంలో 75కేటగిరీలో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. బాక్సింగ్ చాంపియన్ షిప్ కైవసం చేసుకున్న ఆయన్ను ఈ సందర్భంగా డీజీపీ హరీష్ గుప్తా అభినందించారు. ఈ నెల 1నుంచి 4వ తేదీ వరకు అమరావతిలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో విశాఖ పోలీసులు అటు క్రికెట్లోనూ విజయాలు సాధించడంతో నగరమంతా సంబరాలు జరిపారు. అథ్లెట్గా పేరొందిన శంకర్ పోలీసాశాఖలో అడుగు పెట్టాక మరింత రాటుదేలాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు పతకాలు ఆయన ఖాతాలో చేరాయి. ఆలిండియా స్థాయిలో పతకాలు సాధించిన శంకర్తో పాటు ద్వారకాలో పని చేస్తున్న కానిస్టేబుల్ త్రినాథ్కు క్రికెట్లో బెస్ట్ క్రీడాకారుడిగా గుర్తింపు రావడంతో ఆ స్టేషన్ సిబ్బంది కూడా సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు