Homeతెలంగాణఉద్యోగాల పేరుతో మోసం: ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్

ఉద్యోగాల పేరుతో మోసం: ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్

- Advertisement -

శంషాబాద్ విమానాశ్రయంలో యూట్యూబర్ నందన అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు పెండింగ్‌లో ఉండటంతో విమానాశ్రయంలో ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. నందన, ఆమె భర్త కలిసి లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసంపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగానే ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సోమవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి, ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని, కేసు విచారణ చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు