Homeజాతీయంఎయిర్ ఇండియా విమానంలో ఇంజిన్ సమస్య.. వెనక్కి మళ్లింపు

ఎయిర్ ఇండియా విమానంలో ఇంజిన్ సమస్య.. వెనక్కి మళ్లింపు

- Advertisement -

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. కేరళలోని కొచ్చి నుంచి అబుదాబికి బయల్దేరిన విమానంలో గాల్లో ఉండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.సోమవారం ఉదయం కొచ్చి విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన సుమారు 50 నిమిషాల తర్వాత విమానంలోని ఒక ఇంజిన్‌లో ఆయిల్ తగ్గుతున్నట్టు పైలట్లు గుర్తించారు. ఆయిల్ ప్రెజర్ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో వారు వెంటనే ఆ ఇంజిన్‌ను నిలిపివేశారు.ఒకే ఇంజిన్‌తో ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడం క్షేమకరం కాదని భావించిన పైలట్లు, విమానాన్ని తిరిగి కొచ్చికి మళ్లించాలని నిర్ణయించారు. సుమారు 45 నిమిషాల పాటు ఒకే ఇంజిన్‌పై ప్రయాణించి, విమానాన్ని క్షేమంగా కిందకు దించారు. వారి సమయస్ఫూర్తితో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ స్పందించింది. ఘటనకు గల కారణాలపై అంతర్గత విచారణ జరుపుతున్నామని, ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఈ ఘటనపై అధికారికంగా దర్యాప్తు చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులను ఆదేశించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు