విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన ఉరవకొండ కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవా అధికార కమిటీ చైర్మన్ ఖాజా మైనుద్దీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకునేందుకు అవకాశం ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీ కాదగిన కేసులకు ఇరుపక్షాల అంగీకారంతో సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. కేసుల పరిష్కారానికి ఇరుపక్షాలు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని కోరారు.


