Homeజిల్లాలుతూర్పు గోదావరిఅర్హులకు క్షేత్రస్థాయిలో ఎన్టీఆర్ "భరోసా" కల్పిస్తున్నారా?

అర్హులకు క్షేత్రస్థాయిలో ఎన్టీఆర్ “భరోసా” కల్పిస్తున్నారా?

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పేరుతో అర్హత ఉన్న పేద ప్రజలకు వివిధ రకాల పెన్షన్లను కొత్తగా నమోదు చేసుకునే కార్యక్రమం చేపట్టిందని, కానీ క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లిప్తత కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని కడియం మండల బిజెపి అధ్యక్షులు బొరుసు సుబ్రహ్మణ్యం అన్నారు. పంచాయతీ మరియు సచివాలయాలలో తగినంత సిబ్బంది లేకపోవడం, అలాగే కుల, ఆదాయ దృవీకరణ పత్రాలు కోసం తిరిగే ప్రజలకు (సిబ్బంది కొరత కారణంగా) అధికారులు తగిన విధంగా స్పందించకపోవడంతో, కొత్తగా నమోదు చేసుకొనే పెన్షన్ దారులు తీవ్ర నిరాశ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అధికారులు తగు చర్యలు తీసుకుని ప్రతి నిరుపేదకు పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు