Homeజిల్లాలుఅనంతపురంఉచితంగా పశుగ్రాసం సరఫరా చేయాలి

ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేయాలి

- Advertisement -

విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఎల్‌నినో ప్రభావం, నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉరవకొండ నియోజకవర్గం లో పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడి, రైతులు పశువులను అమ్ముకునే దుస్థితి నెలకొందని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల రామాంజనేయులు అన్నారు. గురువారం ఉరవకొండ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేయాలని కోరారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేసి పశువులను సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబుళపతి, మోహన్, మల్లికార్జున, శివ, రాంబాబు పోసా రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు