Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా ముగిసిన 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల వేడుకలు

ఘనంగా ముగిసిన 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; 41వ జాతీయ నేత్రదాన పచోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ధర్మవరం డివిజన్‌లో ప్రజల్లో నేత్రదానం పట్ల అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. ఫైరోజా బేగం ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిప్యూటీ డిఎంహెచ్వో డా. జి. భాగ్యలక్ష్మి మేడం, జిల్లా అంధత్వ నివారణ అధికారి డా. అనురాధ , మాజీ జిల్లా అంధత్వ నివారణ అధికారి డా. ఎస్. నరసింహులు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఎన్జీవో హోం నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రజలకు నేత్రదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. ఒక వ్యక్తి మరణానంతరం తన నేత్రాలను దానం చేయడం ద్వారా అంధులకు చూపును ప్రసాదించవచ్చని, నేత్రదానం ద్వారా సమాజంలో వెలుగును నింపవచ్చని తెలిపారు. ఒక్కరు చేసే నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంపొందించుకొని, ఇతరులను కూడా నేత్రదానానికి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డి ఎం ఓ డా. చెన్నారెడ్డి , డాక్టర్ రాముడు కంటివైద్య నిపుణులు, డా. సురేష్ నాయక్, యు పి హెచ్ సిమెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ ఎ జి ఓ విజయ్ కుమార్, ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప, సి ఓ లు లక్ష్మీనారాయణ, మారుతీ, MPHA ఎం పి హెచ్ ఎ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు