విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్. సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉరవకొండ లోని అగ్రి ల్యాబ్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎరువుల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించేందుకు ఉరవకొండ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లో 10 ట్రేడ్ ఎరువుల నమూనాలను రిజిస్ట్రేషన్ చేసి విశ్లేషణ ప్రారంభించినట్లు చెప్పారు. కాంప్లెక్స్ ఎరువులు, యూరియా, పొటాష్ నమూనాలను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించడం ల్యాబ్ ప్రధాన ఉద్దేశమన్నారు. రానున్న రోజుల్లో ట్రేడ్ విత్తన నమూనాలు, యాక్ట్ శాంపుల్స్‌ను కూడా ల్యాబ్‌లో పరీక్షించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ సిబ్బంది రామన్న తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల నాణ్యతకు అగ్రి ల్యాబ్ భరోసా
- Advertisement -


