Homeబెర్లిన్ ప్రతినిధుల సభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ది లెఫ్ట్!

బెర్లిన్ ప్రతినిధుల సభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ది లెఫ్ట్!

- Advertisement -

బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్ ‘ప్రతినిధుల సభ’కు సెప్టెంబర్ 20న జరిగిన ఎన్నికల్లో అరుణపతాకం రెపరెప లాడింది. ‘ది లెఫ్ట్’ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ‘ది లెఫ్ట్’ పార్టీ 25.7 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. అధికార క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (సి.డి.యు.) పార్టీ 18.8 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫాసిస్టు భావజాలం కలిగిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఎ.ఎఫ్.డి.) పార్టీ 16.3 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. గ్రీన్స్‌ పార్టీ 14.3 శాతం, సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్.పి.డి.) 12.1 శాతం ఓట్లు సాధించాయి. 1990లో తూర్పు, పశ్చిమ జర్మనీల విలీనం తర్వాత దేశ రాజధాని బెర్లిన్ నగరంలో వామపక్ష పార్టీ ఆధిక్యత కనబరచడం ఇదే మొదటి సారి. జర్మనీ ఎన్నికలు మిశ్రమ ఎన్నికల పద్ధతిలో జరుగుతాయి. ప్రతి ఓటరుకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటు తమ నియోజకవర్గ అభ్యర్థికి వేయాల్సి ఉంటుంది. రెండో ఓటు తమకు నచ్చిన రాజకీయ పార్టీకి వేయాల్సి ఉంటుంది. బెర్లిన్ ప్రతినిధుల సభలో మొత్తం 158 స్థానాలు ఉన్నాయి. అందులో 78 స్థానాలు నియోజకవర్గ ప్రతినిధుల కోసం , 80 స్థానాలు పార్టీ జాబితాలనుండి గెలుపొందిన అభ్యర్థుల కోసం కేటాయించారు. ఒక్కొకక్క నియోజకవర్గం నుండి పోటీపడిన అభ్యర్థులలో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థి నియోజకవర్గ అభ్యర్థిగా గెలుపొంది ప్రతినిధుల సభ సభ్యుడు అవుతారు. మిగిలిన 80 స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి దామాషా పద్ధతిలో పంపిణీ చేస్తారు. పార్టీలు ముందస్తుగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా నుండి పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి స్థానాల సంఖ్యకు సరిపడా అభ్యర్థులు ప్రతినిధులుగా నియమితులు అవుతారు. రెండు పద్ధతుల్లో ఎన్నికైన మొత్తం 158 సభ్యులలో మెజారిటీ సాధించిన పార్టీ పాలనా బాధ్యతలు చేపడుతుంది. తాజా సమాచారం ప్రకారం ది లెఫ్ట్ పార్టీ కి నియోజకవర్గాల నుండి 28 మంది ప్రతినిధులు గెలుపొందగా, పార్టీ జాబితా నుండి 19 మంది సభ్యులకు అవకాశం లభించింది. దాంతో మొత్తం ప్రతినిధుల సంఖ్య 47 కు చేరింది. జర్మనీ లోనూ, మొన్నటివరకూ బెర్లిన్ లోనూ అధికార పార్టీగా ఉన్న క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ 34 స్థానాలతో రెండో స్థానం తో సరిపెట్టుకున్నది. అతి తీవ్ర జాతీయవాదుల పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ 29 స్థానాలతో మూడో స్థానానికి చేరింది. గ్రీన్ పార్టీకి 26 స్థానాలు దక్కగా జర్మనీలో చిరకాలం అధికారం చెలాయించిన పురాతన పార్టీల్లో ఒకటైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ 22 స్థానాలతో చివరి స్థానంలో నిలిచింది. మరికొన్ని పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఆయా పార్టీలకు ప్రతినిధులు ఎన్నిక కాకపోగా , ప్రాతినిధ్యం లభించే స్థాయిలో ఓట్లు పడలేదు. గతంలో 12.2 శాతం ఓట్లతో 22 స్థానాలు గెలుపొందిన ది లెఫ్ట్ పార్టీ ఈ ఎన్నికల్లో 25.7 శాతం ఓట్లతో 47 స్థానాలు గెలిచింది. అయితే స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో గ్రీన్స్‌ తో గానీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీతో గానీ పొత్తు పెట్టుకోవచ్చునని భావిస్తున్నారు. ది లెఫ్ట్ పార్టీ ఉపాధ్యక్షరాలిగా, బెర్లిన్ ప్రతినిధుల సభలో పార్టీ బృందానికి ఉప నాయకురాలిగా ఈలిఫ్ ఎరాల్ÎÛ (46) సేవలు అందిస్తూ వచ్చారు.గత పదేళ్ళుగా సామాజికన్యాయం , ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల, మానవహక్కులు, శరణార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆమె పోరాడుతున్నారు. జర్మనీలో ఇటీవల పొడ చూపుతున్న జాతి విద్వేష భావాలకు వ్యతిరేకంగా ఆమె గట్టిగా గళం విప్పి ఉద్యమిస్తున్నారు. టర్కీ మూలాలు కలిగిన కుటుంబంలో ఆమె 1980 లో మ్యూనిక్ లో జన్మించారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఈలిఫ్ ఎరాల్ÎÛ సంకీర్ణం ద్వారా బెర్లిన్ పాలనా పగ్గాలు చేపట్టవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. తీవ్రజాతీయ వాదానికి విరుగుడుగానే బెర్లిన్ పౌరులు వామపక్షం వైపు మొగ్గు చూపించారని అల్ జజీరా చేసిన వ్యాఖ్య గమనించదగినది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు