Homeఆంధ్రప్రదేశ్నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి, పెట్టుబడులపై కీలక నిర్ణయాలు!

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి, పెట్టుబడులపై కీలక నిర్ణయాలు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు ఈ భేటీలో మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ప్రధానంగా అమరావతి పునర్నిర్మాణం, రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, భూ సమీకరణ సంబంధిత అంశాలు అజెండాలో ప్రముఖంగా ఉండనున్నాయి.వీటితో పాటు రాష్ట్రానికి నూతన పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. ఐటీ రంగంలో సుమారు రూ. 526 కోట్లకు పైగా విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. అదేవిధంగా, రాష్ట్రంలోని వర్షాభావం, కరువు పరిస్థితులు, తుపాను ప్రభావం మరియు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ సందర్భంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు