Homeఆంధ్రప్రదేశ్51 మంది వైసీపీ నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంటూ ఆదేశాలు

51 మంది వైసీపీ నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంటూ ఆదేశాలు

- Advertisement -

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై గతంలో దాడి కేసుతో పాటు ఇటీవల విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణిస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నగరం పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ ప్రతిపక్ష వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సహా మొత్తం 51 మందిపై వెంటనే రౌడీషీట్లు తెరవాలని స్థానిక పోలీస్ స్టేషన్ల సీఐలను ఆదేశించారు. ఈ రౌడీషీటర్ల జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఆ పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని అవినాశ్, మాజీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యం, మాజీ కార్పొరేటర్ కాలపాల అంబేద్కర్ సహా పలువురు ముఖ్య నాయకుల పేర్లు ఉన్నాయి. విజయవాడ పరిధిలోని భవానీపురం, అజిత్‌సింగ్‌నగర్, నున్న, కృష్ణలంక, మాచవరం, పటమట, గవర్నర్‌పేట తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న నిందితులపై రౌడీషీట్లు ఓపెన్ చేసే ప్రక్రియను క్షేత్రస్థాయి ఏసీపీలు నేరుగా పర్యవేక్షించాలని కమిషనరేట్ ఆదేశాల్లో పేర్కొన్నారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసు శాఖ స్పష్టం చేసింది. మరోవైపు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ నాయకులపై కక్షపూరితంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు