జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో నాలుగో రోజు భారత్‌కు చిరస్మరణీయంగా నిలిచింది. వెయిట్‌లిఫ్టింగ్ సూపర్ స్టార్ మీరాబాయి చాను మహిళల 49 కేజీల విభాగంలో చారిత్రక రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో ఆమెకు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ విజయంతో ఆమె కెరీర్‌లో మరో మైలురాయిని అందుకుంది.ఇదే రోజు మరో చారిత్రక విజయం కూడా నమోదైంది. సాఫ్ట్ టెన్నిస్‌లో జై మీనా కాంస్య పతకం సాధించి, ఈ క్రీడలో భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో గాయపడటంతో అతను పోరాటాన్ని కొనసాగించలేకపోయినా, కాంస్యంతో దేశానికి గర్వకారణంగా నిలిచాడు.షూటింగ్ రేంజ్‌లోనూ భారత్ పతకాల వేట కొనసాగించింది. పురుషుల స్కీట్ టీమ్ (అనంత్‌జీత్ సింగ్ నరుకా, మైరాజ్ ఖాన్, భవ్‌తేఘ్ సింగ్ గిల్) కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అంతకుముందు మహిళల స్కీట్ జట్టు కూడా ఇదే విభాగంలో కాంస్యం సాధించింది. అయితే, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌కు నిరాశ ఎదురైంది. ఆమె పతకం లేకుండానే వెనుదిరిగింది.ప్రస్తుతం భారత్ ఒక స్వర్ణం, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలతో పట్టికలో 11వ స్థానంలో కొనసాగుతోంది.
ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు చారిత్రక రజతం.. భారత్ ఖాతాలో మరో 3 పతకాలు
- Advertisement -
RELATED ARTICLES


