- Advertisement -
మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఉమామహేశ్వరరావు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టణంలోని 48 వార్డులకు సంబంధించిన వార్డువారి ఫోటో ఓటరు జాబితాలు పరిగణలోనికి తీసుకొని సంబంధిత తాజా అసెంబ్లీ ఓటరు జాబితాల ఆధారంగా మొత్తం ఓటర్ల వివరాలను ప్రచురించడం జరిగిందని మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ జాబితాలో ప్రకటన లు పురపాలక సంఘ కార్యాలయంలో, తాసిల్దార్ వారి కార్యాలయంలో, ఆర్డీవో కార్యాలయంలో ప్రచురించడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఈ జాబితాను చూసుకోవాలని తెలిపారు.


